బడంగ్‌పేటలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న నాదర్‌గుల్ వాసి ప్రసన్నలక్ష్మి, ఎదురుగా వస్తున్న ఆటోను చూసి సడన్ బ్రేక్ వేయడంతో కిందపడింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ ఆమెపై నుంచి దూసుకుకెళ్లింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ప్రసన్నలక్ష్మి ఘటనాస్థలిలోనే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు.