మలక్‌పేట్ - Malakpet

కేటీఆర్‌ను కలిసిన మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి

కేటీఆర్‌ను కలిసిన మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేటీఆర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సత్కరించారు. ప్రజా సేవలో ఆయన పట్టుదల, పీర్జాదిగూడ నగరాభివృద్ధి కోసం చేసిన కృషిని కేటీఆర్ ప్రశంసించారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం సమన్వయంతో ముందుకు సాగాలని, భవిష్యత్తులో పార్టీ కార్యచరణపై సుస్థిర నిర్ణయాలు తీసుకుని విజయం సాధిస్తామని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

వీడియోలు


హైదరాబాద్