బెయిల్ పై విడుదలైన బీఆర్ఎస్ నేత పైలెట్ రోహిత్ రెడ్డి

0చూసినవారు
మొయినబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో రిమాండ్ లో ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పైలెట్ రోహిత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం బెయిల్ పై విడుదలయ్యారు. మంగళవారం హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో, బెయిల్ పత్రాలు జైలుకు చేరడంతో ఆయన విడుదలయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్నగర్లోని పైలెట్ రోహిత్రెడ్డికి చెందిన ఫామ్ హౌస్లో గత నెల 21న అనుమతి లేకుండా భారీ మద్యం, డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్