ఇందిరమ్మ ఇళ్లు నిర్మించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు

1చూసినవారు
గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పట్టణ ప్రాంతాల్లో మొదటి విడతలో లక్ష ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు. మలక్‌పేట నియోజకవర్గంలోని కలడేరా, బి బ్లాక్ కాలనీలలో ప్రభుత్వ గృహ సముదాయాలను మంత్రి అజారుద్దీన్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే బలాల, గృహ నిర్మాణం, రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. పేదలు నివాసం ఉంటున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్