ట్రావెల్స్ మినీ బస్సును ఢీకొన్న కంకర లారీ (VIDEO)

2చూసినవారు
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూ-టర్న్ తీసుకుంటున్న ట్రావెల్స్ మినీ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన కంకర లోడ్ టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్