హైదరాబాద్: సిగరెట్ ఇవ్వలేదని ఘోరంగా కొట్టారు

1377చూసినవారు
హైదరాబాద్: సిగరెట్ ఇవ్వలేదని ఘోరంగా కొట్టారు
రాజేంద్రనగర్ పరిధిలోని ఆర్ మాన్ పాన్ షాప్ వద్ద స్వల్ప కారణంతో జరిగిన దాడి ఉద్రిక్తతకు దారితీసింది. సిగరెట్లు లేవని చెప్పినందుకు షాప్ నిర్వాహకుడు వసీమ్‌పై సుమారు 10 మంది వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వాగ్వాదం కాస్తా గ్యాంగ్ దాడికి దారితీయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దాడి అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారవ్వగా, బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సంబంధిత పోస్ట్