విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై, ముఖ్యంగా నల్గొండ జిల్లా చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. పెద్దకాపర్తి, చిట్యాల వద్ద జరుగుతున్న వంతెన నిర్మాణ పనుల కారణంగా వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. దసరా సెలవుల తర్వాత నగరాలకు ప్రయాణికులు అధిక సంఖ్యలో బయలుదేరడంతో వాహనాల రద్దీ పెరిగింది. పంతంగి టోల్ ప్లాజా, చౌటుప్పల్, దండు మల్కాపురం వద్ద కూడా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.