హైదరాబాద్: మంత్రుల శాఖల్లో మార్పులు ఉంటాయా?

81చూసినవారు
హైదరాబాద్: మంత్రుల శాఖల్లో మార్పులు ఉంటాయా?
రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, పలువురు మంత్రుల శాఖల్లో మార్పులపైనా చర్చించినట్లు తెలుస్తోంది. ఆ భేటీ ముగిశాక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన కూడా హస్తినకు బయల్దేరారు.

సంబంధిత పోస్ట్