చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో, మృతుల మృతదేహాలకు ఒకేచోట పోస్టుమార్టం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు, మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. పోస్టుమార్టం నిర్వహణ కోసం గాంధీ ఆసుపత్రి నుంచి వైద్య బృందం ఉస్మానియాకు చేరుకుంటోంది.