సీనియర్ పాత్రికేయుడు, రచయిత, ఉపాధ్యాయుడు, 'ప్రతిపక్షం' దినపత్రిక సంపాదకుడు మహమ్మద్ ఫజుల్ రెహమాన్ (66) శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత ఆరు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపస్మారక స్థితిలోనే మరణించారు. 1960లో అంతకపేటలో జన్మించిన ఫజుల్ రెహమాన్, 1980లో ఆంధ్రప్రభతో జర్నలిస్టు జీవితం ప్రారంభించి, ఆంధ్రజ్యోతి, 'దిశ', 'ముద్ర' వంటి పత్రికలలో పనిచేశారు. రెండు సంవత్సరాల క్రితం 'ప్రతిపక్షం' దినపత్రికను ప్రారంభించి సంపాదకులుగా సేవలందించారు. 1990లో హుస్నాబాద్ పబ్లిక్ స్కూల్ ను స్థాపించి విద్యార్థులను తీర్చిదిద్దారు. ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు.