వాట్సాప్ కాల్స్ రికార్డింగ్ పై పోలీసుల స్పష్టీకరణ: తప్పుడు ప్రచారమని హెచ్చరిక

1చూసినవారు
వాట్సాప్ కాల్స్ రికార్డింగ్ పై పోలీసుల స్పష్టీకరణ: తప్పుడు ప్రచారమని హెచ్చరిక
హైదరాబాద్ నగర పోలీస్ విభాగం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాట్సాప్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయనే తప్పుడు వార్తపై పౌరులను అప్రమత్తం చేసింది. ఈ ప్రచారంలో ఎటువంటి నిజం లేదని, ప్రజలు భయాందోళనలకు గురి కావద్దని సూచించింది. కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రజలను భయపెట్టడానికే ఈ ఫేక్ న్యూస్‌ను సృష్టిస్తున్నారని, గతంలోనూ ఇలాంటి వార్తలను ఖండించామని పోలీసులు తెలిపారు. తప్పుడు వార్తలను సృష్టించేవారిపై, బాధ్యతారాహిత్యంగా ఫార్వార్డ్ చేసేవారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్