ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

1చూసినవారు
ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ మలక్‌పేట్ వాహెద్ నగర్ వాటర్ ట్యాంక్ సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 7 మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు, 5 సిరింజీలు, ఒక కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇంజెక్షన్లను అక్రమంగా తెచ్చి అధిక ధరలకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుస్తున్నారు. పరారీలో ఉన్న సరఫరాదారుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్