బక్రీద్ ముంగిట మోసాలు: నకిలీ పేమెంట్ యాప్‌లతో వ్యాపారులకు టోకరా

2చూసినవారు
బక్రీద్ ముంగిట మోసాలు: నకిలీ పేమెంట్ యాప్‌లతో వ్యాపారులకు టోకరా
బక్రీద్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో గొర్రెలు, మేకల సంతల్లో డిజిటల్ చెల్లింపుల పేరుతో మోసాలు వెలుగులోకి వచ్చాయి. కేటుగాళ్లు నకిలీ యాప్‌ల ద్వారా చెల్లింపులు జరిగినట్లు స్క్రీన్‌పై చూపించి, వ్యాపారులను మోసం చేస్తున్నారు. కంచన్‌బాగ్, రాజేంద్రనగర్ పరిధిలో ఇలాంటి రెండు సంఘటనల్లో రూ. 1.16 లక్షల విలువైన జీవాలను మోసగించి తీసుకెళ్లారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అప్రమత్తంగా ఉండాలని, బ్యాంక్ అధికారిక SMS లేదా యాప్ ద్వారానే నగదు జమ అయిందో లేదో నిర్ధారించుకున్న తర్వాతే జీవాలను అప్పగించాలని సూచించారు. పెద్ద మొత్తంలో లావాదేవీలకు నగదు రూపంలోనే తీసుకోవడం ఉత్తమమని తెలిపారు.

సంబంధిత పోస్ట్