చాదర్ ఘాట్ పీఎస్ పరిధిలో వ్యాపారి ఫహిముద్దీన్ ఇంట్లో చోరీ 75 తులాల బంగారు నగలు. రూ. 2. 50 లక్షల నగదు చోరీకి గురయ్యాయి. భార్యఅనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొడుతుండటంతో ఫహిముద్దీన్ శుక్రవారం రాత్రి ఇంట్లో తల్లిదండ్రులను ఉంచి ఆసుపత్రికి వెళ్లారు. ఇంటి వెనుక నుంచి లోనికి ప్రవేశించిన ఆగంతకులు ఫహిముద్దీన్ తల్లిదండ్రులు నిద్రిస్తున్న గదికి బయట నుంచి గొళ్లెంవేసి దర్జాగా ఇంట్లో రాత్రి చాలా సేపు తిష్ట వేసి ఫ్రిడ్జ్ లో పండ్లు తిని బీరువాలో బంగారం, నగదు, ఇతర వస్థువులు చోరీ చేసుకొని ఉడాయించారు.