హైదరాబాద్‌లోని దిల్సుఖ్‌నగర్‌లో పోలీస్ ఉద్యోగార్థులు భారీ సంఖ్యలో వర్షాన్ని లెక్కచేయకుండా మెరుపు ధర్నాకు దిగారు. పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్‌ను 5,000 పోస్టులకే పరిమితం చేయకుండా 20,000కు పెంచాలని వారు డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన వయోపరిమితి సడలింపులను ఎందుకు తగ్గించారో ప్రభుత్వం స్పష్టం చేయాలని ప్రశ్నించారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.