
మల్కాజిగిరి లో జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటన
జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా, జాగృతి అధ్యక్షురాలు కవిత మల్కాజిగిరి నియోజకవర్గంలో పర్యటించారు. వినాయక్ నగర్ డివిజన్లోని వాజ్పేయి నగర్ రైల్వే క్రాసింగ్ వద్ద ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బండ చెరువును కూడా సందర్శించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి, ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే జాగృతి జనం బాట ముఖ్య ఉద్దేశమని కవిత తెలిపారు.





































