గుండ్లపోచంపల్లి 299 డివిజన్ పరిధిలోని కండ్లకోయ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బండారి నరేందర్ ముదిరాజ్ కి మద్దతుగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సీనియర్ నాయకుడు బండారి నరేందర్ కు అధ్యక్ష పదవి ఇవ్వకపోవడం చాలా బాధాకరమని వారు అన్నారు. కష్టకాలంలో పార్టీని కాపాడిన నాయకుడు నరేందర్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కండ్లకోయ మాజీ సర్పంచ్ కందడి నరేందర్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ కోప్షన్ సభ్యులు గౌస్ పాషా, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.