మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, శామీర్‌పేట మండలం, తూముకుంట మున్సిపల్ పరిధిలోని దేవరయంజాల్‌లో నాలా ఆక్రమణలపై హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ప్రతి వర్షాకాలంలో దేవరయంజాల్‌లోని పలు కాలనీలు నీట మునుగుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నాలాపై ప్రహరీ గోడలు నిర్మించి కబ్జా చేశారంటూ స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు స్పందించిన హైడ్రా అధికారులు, నాలాపై అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించారు.