తెలంగాణ జనవాణి కార్యక్రమంలో భాగంగా
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి సూచనల మేరకు, నాగోల్‌కు చెందిన మేక ధనేశ్వరి సమస్యపై
జనసేన నాయకుడు, న్యాయవాది రవి రాజ్ రాథోడ్ చొరవ తీసుకున్నారు. హైదరాబాద్, మల్కాజ్‌గిరిలో నాగోల్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, సంబంధిత అధికారులతో కేసు పురోగతిపై శనివారం చర్చించారు. త్వరితగతిన చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని కోరగా అధికారులు సానుకూలంగా స్పందించి రెండు మూడు రోజుల్లో తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.