ఆరోగ్య కేంద్రంలో జిల్లా అధికారి ఆకస్మిక తనిఖీ

1చూసినవారు
ఆరోగ్య కేంద్రంలో జిల్లా అధికారి ఆకస్మిక తనిఖీ
ఉప్పల్, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లోని కుషాయిగూడ ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకం పెంచేందుకు, నాణ్యమైన వైద్యం అందుతున్నదనే భరోసా కల్పించేందుకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. కె. ఆనంద్ బుధవారం కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారి హోదాను పక్కనపెట్టి వైద్యుడిగా రోగులతో నేరుగా మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకున్నారు. అవసరమైన వైద్య సలహాలు అందించి మందులను సూచించారు. రోగుల రిజిస్టర్లు, వైద్య రికార్డులు, మందుల నిల్వలను పరిశీలించారు. వైద్య సిబ్బందితో మాట్లాడి రోజువారీగా అందుతున్న సేవలను సమీక్షించారు.

సంబంధిత పోస్ట్