తెలంగాణ సచివాలయంలో పోలీస్ యూనిఫామ్ ధరించి రీల్ చేసిన ఒంగోలుకు చెందిన రవి (అలియాస్ నిఖిల్) అనే వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వంటమనిషిగా పనిచేస్తున్న నిఖిల్, పోలీసు కావాలనే కోరికతో ఈ పని చేశాడు. కుటుంబ సభ్యులతో కలిసి సచివాలయానికి వచ్చి, భద్రతా సిబ్బందిని ఒప్పించి లోపలికి వెళ్లి రీల్ తీశాడు. అధికారులు నిందితుడిపై చీటింగ్ కేసుతో పాటు ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.