హైదరాబాద్, మల్కాజ్‌గిరిలో శుక్రవారం మల్కాజ్‌గిరి బార్ అసోసియేషన్‌లో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో
జనసేన నాయకుడు, న్యాయవాది రవి రాజ్ రాథోడ్, ఎన్. బి. ఎం. ఐ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు మురళి నాయక్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. రవి రాజ్ రాథోడ్ మాట్లాడుతూ గాంధీ చూపిన సత్యం, అహింస మార్గాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని, శాస్త్రి నిరాడంబర జీవితం, దేశసేవ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.