గౌతమ్ నగర్ డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి

637చూసినవారు
గౌతమ్ నగర్ డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి
గౌతమ్ నగర్ డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ, డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, శనివారం జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని కాలనీలలో మౌలిక వసతుల కల్పన పెండింగ్ లో ఉందని, వాటిని మంజూరు చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేకల రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు.