ఎల్లంపేట రహదారిపై భారీ గుంతలు

4చూసినవారు
ఎల్లంపేట రహదారిపై భారీ గుంతలు
ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని డబిల్ పూర్ కమాన్ వద్ద రహదారిపై ఏర్పడిన భారీ గుంతలు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. వర్షపు నీటితో గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గుమ్మడిదల పలు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ప్రతిరోజూ వేలాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాత్కాలిక మరమ్మతులకు బదులుగా శాశ్వతంగా రహదారిని బాగుచేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. రోడ్డులో గుంతల వల్ల ప్రమాదం జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని, అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరారు.

సంబంధిత పోస్ట్