పరిపాలనను మెరుగుపరిచేందుకు GHMC పరిధిలో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రణాళికలు జరుగుతున్నాయి. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులను మార్చి, ఆరు జోన్ల ఫార్ములాతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఉప్పల్‌ను మల్కాజిగిరిలో కలిపే ప్రతిపాదన కూడా ఉన్నట్లు సమాచారం. ఈ మార్పుల వల్ల పరిపాలన మరింత వేగవంతం అవుతుందని భావిస్తున్నారు.