మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి సాధారణ ఎన్నికల పరిశీలకులు కొర్ర లక్ష్మి అలియాబాద్ మున్సిపాలిటీలోని పోలింగ్ బూతులను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలలో కావలసిన మౌలిక సదుపాయాలు, రేలింగును ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు సూచించారు. మున్సిపాలిటీలలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వివరించారు.