నేటి యువత బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేయాలని గౌతంనగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నెహ్రు నగర్ లో గల విగ్రహానికి ముఖ్యఅతిథిగా హాజరై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు.