బేగంపేటలో పరిస్థితులను పరిశీలించిన మల్కాజిగిరి సీపీ

1చూసినవారు
భారీ వర్షాల నేపథ్యంలో, శనివారం బేగంపేటలోని చికోటీ గార్డెన్ పరిసరాలను మల్కాజిగిరి సీపీ సుమతి ఐపీఎస్, మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఐఏఎస్‌తో కలిసి పరిశీలించారు. ట్రాఫిక్ అంతరాయాలను తొలగించేందుకు చేపడుతున్న చర్యలను సమీక్షించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మున్సిపల్, విపత్తు నిర్వహణ శాఖలతో సమన్వయంతో పనిచేయాలని సీపీ ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్