మమత రాజీనామా చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధం

2చూసినవారు
బెంగాల్‌లో ఎన్నికల్లో ఓడిపోయినా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని లాలాపేటలో వాల్ రైటింగ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. మే 10న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో మార్పునకు ఇదే నాంది అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్