ఒక న్యూస్ ఛానెల్ మహిళా IAS అధికారిపై మంత్రి ఆపేక్ష చూపుతున్నారని ప్రసారం చేసిన వార్తను TG IAS ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. మహిళా అధికారిపై నిరాధార ఆరోపణలు చేశారని, ఇది మహిళా అధికారులు, సివిల్ సర్వీసెస్పై దాడిగా పరిగణిస్తున్నామని అసోసియేషన్ పేర్కొంది. ఆ న్యూస్ ఛానెల్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఇలాంటి దురుద్దేశపూర్వక కంటెంట్ను ప్రసారం చేయవద్దని మీడియా సంస్థలను హెచ్చరించింది.