
పేపర్ కప్ లో టీ తాగుతున్నారా..? జాగ్రత్త అంటున్న వైద్యులు !
వేడి పానీయాలను పేపర్ కప్పులలో తాగడం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పేపర్ కప్పులోని ప్లాస్టిక్ పొర వేడికి కరిగి, పావుగంటలో సుమారు 25 వేల ప్లాస్టిక్ మైక్రోపార్టికల్స్ శరీరంలోకి చేరుతున్నాయని, ఇది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్యులు తెలిపారు. కాబట్టి, పేపర్ కప్పులలో టీ వంటి వేడి పానీయాలు తాగేటప్పుడు జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు.




