జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను వై. రమేష్ ఆధ్వర్యంలో మల్కాజ్ గిరిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు నాయకులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రానున్న రోజుల్లో తెలంగాణలో
జనసేన పార్టీ మరింత బలంగా ప్రజల తరఫున పోరాడుతుందని నాయకులు అన్నారు. కార్యక్రమంలో
జనసేన నాయకులు రవిరాజ్ రాథోడ్, పెద్దిరాజు, వై. రమేష్‌తో పాటు పలువురు కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.