మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని నాగారంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను భాజపా నాయకులు, అభిమానులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ భాజపా అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఏనుగు సుదర్శన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో నాగారం మాజీ జడ్పీటీసీ సురేష్, భాజపా ప్రధాన కార్యదర్శి పోతంశెట్టి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు కర్ర వెంకటేశ్వర్ పటేల్, మేడ్చల్ జిల్లా నాయకులు సంపత్ యాదవ్, డాక్టర్ అనూష, వెంకటేష్‌తో పాటు పలువురు మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.