పేకాట రాయుళ్లపై పోలీసుల కొరడా.. ముగ్గురి అరెస్టు

4చూసినవారు
పేకాట రాయుళ్లపై పోలీసుల కొరడా.. ముగ్గురి అరెస్టు
మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని కాప్రా మండలం జవహర్‌నగర్‌ గోశాల సమీపంలో డబ్బులు పందెం పెట్టి పేకాట ఆడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారయ్యారు. మంగళవారం రాత్రి గోశాల సమీపంలో పేకాట జరుగుతున్నట్లు ఎస్‌ఐ కె. రమేష్‌కు సమాచారం అందింది. దీంతో సిబ్బందితో అక్కడికి వెళ్లి దాడి చేశారు. పోలీసులను గమనించిన రవి, నాగరాజు, రాజు పరారయ్యారు. పిట్టల బాలయ్య, ఎర్రగుంట రాజు, దేవరుప్పుల మహేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు సెట్ల పత్తాలు, రూ. 6, 950 నగదు, రెండు సెల్‌ఫోన్లు, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్