మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య, అన్నదమ్ములతో కలిసి భర్తను హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం, కర్కల్ పహాడ్ గ్రామానికి చెందిన జాతవత్ నరేందర్ (40), భార్య సోనితో కలిసి 16 ఏళ్లుగా హైదరాబాద్ లో కూలీలుగా పనిచేస్తున్నారు. మద్యం అలవాటుతో తరచుగా గొడవ పడేవారు. బుధవారం ఉదయం 10 గంటలకు నరేందర్ మరణించాడని, మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారని తల్లికి సమాచారం అందింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.