హైదరాబాద్, మల్కాజ్‌గిరి, మేడ్చల్‌లోని మేడ్చల్ సర్కిల్ గుండ్లపోచంపల్లి డివిజన్‌లో పారిశుద్ధ్య కార్మికులు బుధవారం ధర్నా చేపట్టారు. నగరం నిద్రలేవక ముందే పట్టణాలను శుభ్రం చేసే తమకు చేతి గ్లౌస్‌లు, చీపుర్లు, సబ్బులు, నూనె, బెల్లం వంటి భద్రతా వసతులు గత ఎనిమిది నెలలుగా అందడం లేదని, సైబరాబాద్ కార్పొరేషన్‌లో విలీనం జరిగినా మున్సిపల్ పాలనలోని వేతనాలే ఇస్తూ, పన్నుల పేరుతో నెలకు రూ. 500 కోత విధిస్తున్నారని కార్మికులు ఆరోపించారు. వారికి
బీజేపీ నాయకుడు అమరం మోహన్‌రెడ్డి మద్దతు తెలిపారు. అధికారులు స్పందించి భద్రతా పరికరాలు, కనీస వేతనాలు కల్పించాలని కార్మికులు కోరారు.