మల–మూత్ర విసర్జన చేసిన నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలి

2చూసినవారు
శనివారం రాత్రి నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సఫిల్‌గూడ కట్ట మైసమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహం ముందు మల–మూత్ర విసర్జన చేసిన నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను సహించబోమని, ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్