ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని డబిల్‌పూర్ మల్కా చెరువు కట్టపై పెరిగిన తుమ్మ చెట్లను వెంటనే తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డుపైకి వంగి ఉన్న చెట్ల కొమ్మల వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని, ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో రాత్రిపూట మరింత ఇబ్బందిగా ఉందని, అధికారులు వెంటనే స్పందించి చెట్లను తొలగించాలని కోరుతున్నారు.