తెలంగాణ రక్షణ సేన పార్టీని ఇంటింటికి తీసుకువెళ్తాం...

386చూసినవారు
మల్కాజిగిరి నేరేడ్మెట్ టిఆర్ఎస్ నాయకురాలు పిట్ల విజయలక్ష్మి, కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీని ఇంటింటికి తీసుకువెళ్తామని తెలిపారు. నేరేడ్మెట్ క్రాస్ రోడ్లో టిఆర్ఎస్ జెండా పండుగ సందర్భంగా టిఆర్ఎస్ జెండాను ఎగురవేసిన అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతానికి కవిత తీసుకువస్తున్న విద్యా, వైద్యం, రైతు వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం అంశాలతో ముందుకు వెళ్తామని, రాబోయే రోజుల్లో కవితను తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రిని చేయడానికి కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్