ఎడిఫై ప్రైవేట్‌ పాఠశాల దోపిడీకి అడ్డుకట్ట ఏది

0చూసినవారు
హైదరాబాద్, మల్కాజ్‌గిరి, మేడ్చల్ పరిధిలోని ఎడిఫై పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, దుస్తుల విక్రయాలలో భారీ దోపిడీ జరుగుతోంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన పుస్తకాలు ₹500-₹1000 లోపు ఉండగా, ప్రైవేట్ ప్రచురణకర్తలతో కుమ్మక్కైన యాజమాన్యం ₹5,000-₹10,000 వరకు ధరలు నిర్ణయించి, విద్యార్థులపై ఒత్తిడి తెస్తోంది. పాఠశాల ప్రాంగణంలో వాణిజ్యపరమైన విక్రయాలు నిషేధించినా, నిర్దేశిత దుకాణాల దందా కొనసాగుతోంది. ఈ దోపిడీకి అడ్డుకట్ట ఎప్పుడు పడుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్