అల్వాల్ లో భర్తను భార్య గొడ్డలితో నరికి చంపిన విషయం తెలిసిందే. భర్త, సొంత కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడడంతో భార్య రమాదేవి అతడిపై ఆదివారం అర్థరాత్రి గొడ్డలితో దాడి చేసి చంపింది. నిత్యం రాత్రి ఇంట్లో గొడవలు, అరుపులు వినపడేటవని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. భార్య రమాదేవి పిల్లలతో సహా పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.