భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య

5చూసినవారు
భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య
హైదరాబాద్‌లోని అల్వాల్ గోపాల నగర్‌లో రమాదేవి అనే మహిళ తన భర్త శ్రీనివాస్‌ను గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేసింది. మచ్చబొల్లారంలో నివసిస్తున్న ఈ దంపతుల మధ్య వ్యాపారంలో నష్టాలు రావడంతో తరచుగా గొడవలు జరుగుతున్నాయని సమాచారం. ఆదివారం రాత్రి జరిగిన తీవ్ర స్థాయి గొడవలో విచక్షణారహితంగా దాడి చేసి హత్యకు పాల్పడింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని హత్యకు కేవలం వ్యాపార నష్టాలే కారణమా లేక వేరేమైనా వివాదాలు ఉన్నాయా అనే కోణంలో నిందితురాలిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్