మేడ్చల్ మున్సిపాలిటీ పరిధి గిర్మాపూర్కి చెందిన ముక్కెర కీర్తన(20) శుక్రవారం ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందింది. ఆమె చిన్నాన్న ప్రభాకర్, సోదరి సంకీర్తనతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, కండ్లకోయ సమీపంలో అతివేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కీర్తన అక్కడికక్కడే మృతి చెందగా, మిగతా ఇద్దరికి గాయాలయ్యాయి. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.