మల్లారెడ్డి యూనివర్సిటీలో
26-27 విద్యాసంవత్సరంలో
ఇంజనీరింగ్ అడ్మిషన్ల కొసం టెస్ట్ (MRJEE-2026) మే 14న కామన్ ఎంట్రన్స్
నమోదు ప్రక్రియ ప్రారంభించారు.
ఈ ఎంట్రన్స్ టెస్ట్ దేశవ్యాప్త విద్యార్థులకు అవకాశం కల్పిస్తానారు.
మే 14, 2026న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (MRJEE) నిర్వహించనున్నట్లు వెల్లడించి దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఛైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి, డైరెక్టర్ డాక్టర్ ప్రీతి రెడ్డి, చామకూర షాలీనీ రెడ్డి,
వైస్ ఛాన్సలర్ డాక్టర్ వీఎస్‌కే రెడ్డి కలిసి ఆవిష్కరించారు.
ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తిస్తూ అర్హులైన విద్యార్థులకు మల్లారెడ్డి యూనివర్సిటీ సుమారు రూ. 10 కోట్ల విలువైన స్కాలర్‌షిప్పులను అందజేస్తున్నారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల బోర్డులు, సెంట్రల్ బోర్డు విద్యార్థులు ఎవరైనా ఈ పరీక్ష రాసేందుకు అర్హులని వారు తెలిపారు.
ఛైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి మాట్లాడుతూ "మా లక్ష్యం విద్యార్థులను కేవలం పట్టభద్రులుగా మార్చడం మాత్రమే కాదు, వారిని క్రమశిక్షణ, నైతిక విలువలు గల ప్రపంచ స్థాయి నిపుణులుగా తీర్చిదిద్దడం. ఈ ఏడాది మెరిట్ విద్యార్థులతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) వారిని ఆదుకోవడానికి స్కాలర్‌షిప్ పథకాలను ప్రవేశపెట్టాం."అన్నారు
డైరెక్టర్ డాక్టర్ ప్రీతి రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ను రూపొందించాం. బోధనలో నిరంతరం కొత్త పద్ధతులను పాటిస్తూ, అండర్ గ్రాడ్యుయేట్ నుండి రీసెర్చ్ వరకు అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నాం."అన్నారు
వైస్ ఛాన్సలర్ డాక్టర్ వీఎస్‌కే రెడ్డి మాట్లాడుతూ "అర్హులైన విద్యార్థులను గుర్తించేందుకే మే 14న ఈ పరీక్షను నిర్వహిస్తున్నాం. ఆసక్తి గల వారు యూనివర్సిటీ వెబ్‌సైట్
www.mallareddyuniversity.ac.in సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చు. విద్యార్థి నాలెడ్జ్ మరియు స్కిల్స్ ఆధారంగానే ఈ స్కాలర్‌షిప్పులు మంజూరు చేస్తాం."అని అన్నారు.
బైట్ : డా" భద్రారెడ్డి...చైర్మన్
బైట్ : డా" ప్రీతీరెడ్డి....డైరెక్టర్
బైట్ : VSK రెడ్డి... వైస్ ఛాన్సలర్