మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల సుమా రెసిడెన్సిలో నివాసం ఉంటున్న ఆంజనేయులు కుమార్తె వర్ష (19) నవంబర్ 30వ తేదీ ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె పనిచేస్తున్న బట్టల షాపు యజమానితో మాట్లాడగా, వర్ష షాపుకు రాలేదని తెలిపారు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండటంతో ఆందోళన చెందిన తండ్రి బాలాంజనేయులు మంగళవారం మేడిపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. యువతి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.