శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

1చూసినవారు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎమ్మార్వో సుచరిత ఏసీబీ అధికారులకు చిక్కినట్లు సమాచారం. బొమ్మరాస్‌పేట్ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములను ఉన్నతాధికారులతో కలిసి క్లియర్ చేశారనే ఆరోపణలపై విచారణ జరుగుతోంది. భూ వ్యవహారాలకు సంబంధించిన కీలక పత్రాలు, ఫైళ్లు, రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. రెవెన్యూ శాఖలో జరిగిన అనుమానాస్పద లావాదేవీలు, భూముల క్లియరెన్స్ ప్రక్రియలో అక్రమాలపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్