దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్‌పల్లి గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న బొలెరో డ్రైవర్ వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టడంతో, బైక్‌పై వెళ్తున్న తల్లి గుమ్మడి ఉదయ్ లతారెడ్డి(49) అక్కడికక్కడే మృతిచెందారు. బైక్ నడుపుతున్న ఆమె కొడుకు, డిగ్రీ విద్యార్థి వేదాంత్ రెడ్డి(22)కి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.