మాజీ ఉప ప్రధాని డాక్టర్ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆయన విగ్రహనికి మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి ఆదివారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంధర్భంగా వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమర యోధుడిగా, సంఘసంస్కర్తగా రాజకీయ నాయకుడిగా దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీమన్నారు.