కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శిశువు మృతదేహం లభ్యం...

0చూసినవారు
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం, విజయపురి కాలనీ, రోడ్ నెం. 4 లోని ధోబీఘాట్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు 1-2 రోజుల వయస్సు గల నవజాత మగ శిశువు మృతదేహాన్ని తెలుపు రంగు కవర్‌లో పెట్టి చెట్లపొదలో పడేసి వెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అంబులెన్స్ సిబ్బంది శిశువును పరీక్షించగా మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్