"మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి కండ్లకోయలోని CMRTI కళాశాలలో శనివారం తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ఘనంగా జరుపుకున్నారు. కళాశాల సెక్రటరీ గోపాల్ రెడ్డి పూజలు నిర్వహించి, ఉపాధ్యాయులు, విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పండుగ వైభవంగా జరుపుకున్నారు. డైరెక్టర్ డాక్టర్ జంగారెడ్డి విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేయాలన్న ఉద్దేశంతో దీన్ని నిర్వహించినట్లు తెలిపారు.